వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదల్లో తెలుగువారు, భజ్జీ కూడా: రక్షించాలని ట్వీట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harbhajan stuck in Uttarakhand rains
డెహ్రాడూన్/హైదరాబాద్: ఉత్తరాఖండ్ వరదల్లో దాదాపు రెండు వేల మంది తెలుగు వారు చిక్కుకున్నారు. అన్ని జిల్లాలకు చెందిన భక్తులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోతున్నారు. దీంతో భక్తులు నాలుగు రోజులుగా నీళ్లు, తిండి లేక లేదా బిస్కట్లు తదితర వస్తువులు తింటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఓ వైపు వర్షాలు తగ్గక వరద ఉధృతి పెరుగుతుండటంతో వారిని కాపాడేందుకు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగువారు అందరూ క్షేమంగానే ఉన్నారు. తెలుగువారి కోసం సహాయక చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణతో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కూడా అధికారులను ఆదేశించారు.

వారి క్షేమ సమాచారాలందక వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక అధికారులు సహాయ చర్యలు చేపడదామన్నా.. వాన ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో ఏమీ చేయలేక చేతులెత్తేశారు. బుధవారం దాకా పరిస్థితి ఇంతేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం తెలిసి యాత్రికులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితి చూసి యాత్రికులు భయపడాల్సిన పని లేదని, రెండు రోజుల్లో పరిస్థితి చక్కబడి అంతా క్షేమంగా స్వస్థలాలకు చేరుకుంటారని చెబుతున్నారు.

వరదల్లో చిక్కుకుపోయిన భజ్జీ

ఉత్తరాఖండ్ వరదల్లో ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా చిక్కుకుపోయాడు. తాను క్షేమంగానే ఉన్నానంటు అతని ట్వీట్ చేశాడు. హర్భజన్ ఉత్తరాఖండ్‌లోని గురుద్వారకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వరదల్లో చిక్కుకుపోయాడు. ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీసుల శిబిరంలో తలదాచుకున్నాడు. తాను బాబాజీ దయ వల్ల క్షేమంగానే ఉన్నానని, ఇక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయని, చాలామంది ప్రజలు ఇక్కడ చిక్కుకుపోయారని, వారిని ప్రభుత్వం రక్షించాలని ఆయన ట్వీట్ చేశాడు.

English summary
Cricketer Harbhajan is one amongst the many pilgrims and tourists who have been stranded in the upper reaches of Uttarakhand due to landslides and heavy rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X