వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఇచ్చే వరకు సిఎం పదవి వద్దని చెప్పా: జానా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: తనకు ముఖ్యమంత్రి పదవి కంటే తెలంగాణే ముఖ్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి మరోసారి చెప్పారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఉద్యమానికి దూరంగా ఉంటానని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అదంతా వట్టిదే అన్నారు. తెలంగాణ ఇచ్చే వరకు ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉంటానని తాను అధినేత్రితో చెప్పానన్నారు. తెలంగాణ ప్రకటిస్తే తాను జీవితాంతం పార్టీ కోసమే పని చేస్తానన్నారు.

తెలంగాణ ప్రాంత మంత్రులు అందరు కలిసి రాజీనామా చేస్తే రాష్ట్ర ఏర్పాటు ఖాయమని మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి అన్నారు. తెలంగాణకు ప్యాకేజీలు ఆమోదయోగ్యం కాదని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ప్యాకేజీల వల్ల సమస్యలు పెరుగుతాయని బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ నేతలు తెలంగాణ రాష్ట్రం కోరడంలో తప్పు లేదని కానీ, పోటీ చేయమని చెప్పడం మాత్రం ఏమాత్రం సరికాదని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి విచిత్ర వ్యాఖ్య చేశారు.

ప్యాకేజీలు వద్దు: కోదండ

తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి ప్యాకేజీలు అవసరం లేదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అదిలాబాద్ జిల్లాలో అన్నారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ తమకు కావాలన్నారు. తెలంగాణ సాధన కోసం శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తే.. తెలంగాణ ప్రజలను హైదరాబాద్ రానీయకుండా అక్రమ అరెస్టులు చేసి అడ్డుకున్నారని ఆరోపించారు.

జూలై 4వ తేదిన కాంగ్రెసు నాయకులను పల్లెల్లోకి రానీయకుండా తెలంగాణవాదులు అడ్డుకుంటారన్నారు. జూలై 4 వరకు తెలంగాణ నేతలకు గడువిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వారు కాంగ్రెసు నుండి బయటకు వచ్చి పోరాటం చేయాలని లేదంటే వారిని గ్రామాల్లోకి రానివ్వమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

English summary
Minister Jana Reddy said on Wednesday that he will not accept CM post till Telangana will announce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X