మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లెక్చరర్ వేధింపు: ఇంటర్మీడియేట్ అమ్మాయి ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Inter girl student commits suicide
హైదరాబాద్/మెదక్: కృష్ణా జిల్లాలోని ఎ.కొండూరు మండలం గొల్లమందలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ విద్యార్థిని మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. ఓ అధ్యాపకుడి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. విస్సన్నపేటలోని అధ్యాపకుడి వేధింపుల వల్లే ఆమె మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు అధ్యాపకుడి ఇంటిపై దాడి చేసి చితకబాదారు.

కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు, గ్రామస్థులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. యాజమాన్యం, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. విద్యార్థిని పురుగుల మందు తాగి మృతి చెందింది.

మెదక్ జిల్లాలో...

మెదక్ జిల్లాలోని జహీరాబాదులో ఉన్న ఇండియన్ ఇన్ఫోలైన్ కార్యాలయం పైన పోలీసులు దాడి చేశారు. బీమా పేరిట మోసాలకు పాల్పడుతున్నారని నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆస్తి కోసం అన్న హత్య

విశాఖపట్నం జిల్లాలో ఆస్తి కోసం తోడబుట్టిన అన్నను హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఓ తమ్ముడు అన్నను ఆస్తి కోసం చంపి, పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

యురేనియం ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

కడప జిల్లాలోని తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన బుధవారం ఉద్రిక్తతకు దారి తీసింది. రెండో ప్లాంట్ వద్ద నారాయణ తదితరులు ఆందోళనకు దిగారు. వారు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

English summary

 An intermediate girl student committed suicide in Krishna district for lecturer harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X