వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీతో నరేంద్ర మోడీ భేటీలో ఏం జరిగింది?

By Pratap
|
Google Oneindia TeluguNews

Narendra Modi - LK Advani
న్యూఢిల్లీ: పార్టీలో పదోన్నతి లభించిన తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రచార రథసారథి నరేంద్ర మోడీ పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీతో మంగళవారం జరిగిన భేటీపై జాతీయ స్థాయిలో ఉత్కంఠ చోటు చేసుకుంది. ఇరువురి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. నరేంద్ర మోడీకి పదోన్నతి కల్పించడాన్ని వ్యతిరేకిస్తూనే అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేశారని విస్తృతంగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య భేటీపై ఆసక్తి చోటు చేసుకుంది.

ఇరువురు నేతల మధ్య సామరస్యపూర్వక వాతావరణంలో మాటామంతీ సాగిందని పార్టీ వర్గాలు చెప్పాయి. మోడీ అద్వానీ ఆశీస్సులు కోరినట్లు సమాచారం. తాను సీనియర్ నేతలను సంప్రదించే ముందుకు సాగుతానని మోడీ అద్వానీతో చెప్పినట్లు సమాచారం. తాను రాజీనామా చేసిన కారణం వేరని, నీకు పదోన్నతి కల్పించడాన్ని నిరసిస్తూ రాజీనామా చేయలేదని అద్వానీ మోడీతో చెప్పినట్లు సమాచారం.

లోకసభకే కాకుండా కొన్ని రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పర్యవేక్షణకు రెండు విడివిడి జట్లను ఏర్పాటు చేయాలని అద్వానీ ఆర్‌ఎస్ఎస్‌కు సూచించినట్లు, ఈ సూచనను ఆర్‌ఎస్ఎస్ తిరస్కరించినట్లు చెబుతున్నారు. తన రాజీనామాకు అదే కారణమని అద్వానీ చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద, నరేంద్ర మోడీ అద్వానీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు.

అద్వానీ రాజీనామా మోడీ పదోన్నతిపై కాదు

అద్వానీ రాజీనామాకు మోడీని పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించడం కారణం కాదని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అద్వానీ రాజీనామాకు వేరే కారణాలున్నాయని ఆయన చెప్పారు. ముంబైలో ఓ ప్రముఖ దినపత్రిక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఆ విషయం చెప్పారు. మోడీని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించిన విషయంలో ప్రజల నాడిని విస్మరించబోమని ఆయన అన్నారు.

English summary

 Sources said the meeting was "positive" and that the Gujarat Chief Minister "sought Mr Advani's blessings" while promising to consult senior leaders in his new role.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X