వైయస్ జగన్ కేసులో మెమో దాఖలు చేసిన సిబిఐ

అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను 2012 మే 27వ తేదీన సిబిఐ అరెస్టు చేసింది. జగన్‌ను సాయంత్రం 7 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అరెస్టు చేసింది. జగన్ అరెస్టును సిబిఐ డైరెక్టర్ ఢిల్లీలో ధ్రువీకరించారు. దాదాపు 24 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత సిబిఐ జగన్‌ను అరెస్టు చేసింది.
అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్‌ది ఐదో అరెస్టు. ఇంతకు ముందు జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డి, మాజీ మంత్రి దేవినేని వెంకటరమణలను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులను కూడా సిబిఐ నిందితులుగా చేర్చింది. చార్జిషీట్లలో నిందితులుగా చేర్చడంతో వారు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications