జగన్‌కు సిఎం రక్ష: నారాయణ, స్టోరీపై టిడిపిVsటిఆర్ఎస్

టిడిపి వర్సెస్ టిడిపి
తమ పార్టీ నేతలపై వచ్చిన ఎలాంటి ఆరోపణలకైనా తాము సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు హైదరాబాదులో అన్నారు. పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ఆస్తులపై విచారణకు తాము సిద్ధమని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తన ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బంగారు తల్లి పథకం ఓ పథకమే కాదన్నారు. తల్లి మీద బంగారం అమ్మినా ఫీజులు కట్టలేని పరిస్థితి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యమాన్ని కాంగ్రెసు పార్టీకి తాకట్టు పెట్టారని తెలుగుదేశం పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, నాగేశ్వర రావు మండిపడ్డారు. ఉద్యమం ముసుగులో కెసిఆర్ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ కుటుంబానికి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
ఉద్యమం ముసుగులో వేలకోట్లు ఆ కుటుంబం సంపాదించుకుంటున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలన్నారు. కెసిఆర్ తన ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించాలని సవాల్ చేశారు. కెసిఆర్‌ది అసలు తెలంగాణనే కాదన్నారు. పార్టీ కోసమే ఉద్యమాన్ని నడిపిస్తున్నారని, కెటిఆర్ తన పైన వచ్చిన ఆరోపణలను రుజువు చేసుకోవాలన్నారు. టిడిపి చరిత్రను ప్రశ్నిస్తున్న కెటిఆర్.. తనన నాన్నను అడిగి తెలుసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications