కేసు: వంశీప్రియ ఆరోపణలపై శంకరరావు ఘాటు వ్యాఖ్య

Shankar Rao
హైదరాబాద్: తన కోడలు అంటూ ఓ మహిళ తనపై చేసిన ఆరోపణలను మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు గురువారం ఖండించారు. మూడేళ్ల క్రితమే ఓ డ్రైవర్‌తో వెళ్లిపోయిన ఆమె తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై తాను స్పందిస్తున్నందుకు, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నందుకే అధికార పక్షంలోని కొందరు నేతలు తనపై కక్ష కట్టారన్నారు. తనపై ఇదే చర్యలు కొనసాగితే తెలంగాణలో పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు.

కాగా, శంకర రావు, ఆయన కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారంటూ ఆయన కోడలు వంశీప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శంకర రావు కోడలు వంశీప్రియ మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త శశాంక్, మామ శంకర రావు, అత్త విశ్వశాంతి, ఆడపడుచు సుష్మితను అరెస్టు చేయాలని ఆమె అందులో కోరారు. వారు తమను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులచే విచారణ జరిపించాలని కోరారు.

తనను వరకట్నం కోసం వేధిస్తున్నారని ఆమె అన్నారు. అంతకుముందు క్రిమినల్ కోర్టు వారిని కోర్టు ఎదుట లొంగిపోవాలని, పాస్‌పోర్టులు పోలీసులకు ఇవ్వాలని ఆదేశించిందని కానీ, వారు సరెండర్ కాలేదని, వారిపై పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. వంశీప్రియ చేసిన ఫిర్యాదు మేరకు... శంకర రావు కూతురు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతనే తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె పేర్కొన్నారు.

తనను వేధిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె పిటిషన్ స్వీకరించిన కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. శంకర రావు లొంగుబాటు తన కోడలు వంశీప్రియను వేధించిన కేసులో మాజీ మంత్రి శంకర రావు సిసిఎస్ మహిళా పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయారు. శంకర రావుతో పాటు ఆయన భార్య విశ్వశాంతి కూడా లొంగిపోయారు. వారు ఇప్పటికే ముందస్తు బెయిల్‌ను పొందారు. వంశీప్రియ ఆరోపణలపై ఆయన ఈ రోజు స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+