ఫిక్సింగ్: బుకీల నుంచి డబ్బులు తీసుకున్న త్రివేది

బుకీలు దీపక్ శర్మ, సునీల్ భాటియాల నుంచి తాను 2012లో 3 లక్షల రూపాయలు తీసుకున్నానని, స్టింజ్ ఆపరేషన్‌లో పలువురు దేశివాళీ క్రికెటర్లు పట్టుబడిన నేపథ్యంలో వాటిని తిరిగి ఇచ్చేసినట్లు త్రివేది చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ అరెస్టయ్యారు. ఈ కేసులో త్రివేది ప్రాసిక్యూషన్ సాక్షిగా మారాడు. మే 16వ తేదీన పోలీసులు ఆ ముగ్గురు ఆటగాళ్లను అరెస్టు చేశారు.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో పోలీసులు మొత్తం 26 మందిని అరెస్టు చేశారు. వారిలో కొంత మంది మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. అజిత్ చండిల మినహా మిగతావారందరూ బెయిల్‌పై విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications