లక్ష చెప్పులతో కెసిఆర్‌పై తిరుగుబాటు: చింతాస్వామి

తెరాస అధినేత కేసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమం ముసుగులో చేస్తున్న దందాలు, బెట్టింగులన్నీ వచ్చే పది నెలల కాలంలో నెలకొకటి చొప్పున బయటపెడతానని చింతస్వామి హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొనలేదని, తనకు ఏ మాత్రం సంబంధం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
తాను కెసిఆర్‌కు రాసిన బహిరంగ లేఖకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేఖలో లేవనెత్తిన అంశాలపై స్పందించక పోతే వచ్చే నెల 7న వెయ్యి డప్పులు, లక్ష చెప్పులతో కేసిఆర్‌పై తిరుగుబాటు ఉద్యమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
కుట్ర పూరితంగా పలువురిని రెచ్చగొట్టి తెలంగాణ భవన్ వద్ద తనపై దాడి చేయించారని ఆరోపించారు. దీనికి బాధ్యులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని చింతస్వామి మాదిగ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications