జగన్ పార్టీని వీడేది లేదు: కొండా సురేఖ స్పష్టీకరణ

అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులను తొలగించకపోతే ప్రభుత్వానికే నష్టమని ఆమె అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ సరిగా జరగలేదని ఆమె విమర్శించారు. రిజర్వేషన్ల ప్రక్రియలో అవకతవకలున్నాయని అన్నారు. పంచాయతీ ఎన్నికల్ోల విజయం సాధించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు.
కిరణ్ రెడ్డికి విజయమ్మ లేఖ
ఇదిలావుంటే, వివిధ అంశాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఇందిర క్రాంతి పథం సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆమె ఆ లేఖలో అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు పెరగడం లేదని అన్నారు. హేతుబద్దమైన ఐకెపి ఉద్యోగుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.
108 ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని ఆమె అన్నారు తమ డిమాండ్లపై నోరెత్తినందుకు వారిపై అక్రమ కేసులు పెట్టినట్లు ఆమె ఆరోపించారు. వారిని సస్పెన్షన్లకు గురి చేశారని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే వారి వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications