వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరఖండ్ వరదలు: 19 మంది తెలుగువారు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Uttarakhand
హైదరాబాద్: ఉత్తరకాశీ యాత్రకు వెళ్లిన తెలుగువాళ్లలో మృతుల సంఖ్య 19కి చేరుకుంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. గురువారంనాడు ఏడుగురు తెలుగువాళ్లు మరణించినట్లు గుర్తించారు. తాజాగా మరో 12 మంది మరణించినట్లు సమాచారం అందింది. దీంతో ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో మరణించినవారి తెలుగువాళ్ల సంఖ్య 19కి చేరుకుంది. రాంబారా ప్రాంతంలో మరణించినవారిలో అనంతపురం జిల్లాకు రాయదుర్ద్‌కు చెందిన వీరభద్రస్వామి (20) ఉన్నట్లు గుర్తించారు.

తెలుగువాళ్లు 2600 మంది క్షేమంగా ఉన్నట్లు శుక్రవారం రాత్రి సమాచారం అందింది. గుంటూరు జిల్లా కొల్లిపర మండల ముల్లంగి గ్రామవాసులు కుమారి (47), మల్లేశ్వరి (46) కేదార్‌నాథ్‌లో గత ఆదివారం మృతిచెందినట్లు సమాచారం అందింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సాయిలక్ష్మి, అర్జునరావు ఉత్తరాఖండ్‌లో మరణించినట్లు వారి బంధువులకు సమాచారం అందింది. విజయవాడకు చెందిన 8 మంది, ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు గల్లంతయ్యారు.

కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన ఆకుల నారాయణగౌడ్ (55) చార్‌ధామ్ యాత్రలో మరణించారు. కొండచరియలు విరిగిపడి మూడు రోజుల క్రితమే ఈయన మృతిచెందినట్లు శుక్రవారం తెలిసింది. ఖమ్మం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ గురవయ్య (70) చార్‌ధామ్ యాత్ర నుంచి తిరిగివస్తూ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారు.

విశాఖ జిల్లా నుంచి యాత్రకు వెళ్లిన 23 మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. కృష్ణా జిల్లా నుంచి వందలాది మంది యాత్రికులు కేదార్‌నాథ్ తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లగాఇంకా 146 మంది రావాల్సి ఉంది. వారిలో కేవలం ఐదుగురే ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకున్నారు. మిగిలినవారి ఆచూకీ తెలియలేదు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచన మేరకు శుక్రవారం కేందర్ సహాయ మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దానం నాగేందర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని ఎపి భవన్‌కు చేరుకున్న బాధితులకు వారు భోజనం, మందులు, వైద్యచికిత్సలు అందిస్తున్నారు.

English summary
The number of pilgrims from Andhra Pradesh who died in the flash floods in Uttarakhand has gone up to 19 on Friday even as control rooms set up in districts continue to receive complaints about missing people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X