విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొట్టు, బైబిల్‌పై మాటలు, దిగజారుడే: విజయమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
విజయవాడ: తమ కుటుంబంపై, బొట్టు, బైబిల్‌లపై తమ రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడుతున్నారని, ఇది దిగజారుడు రాజకీయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. తన బిడ్డ ఏం తెప్పు చేశాడని, జగన్‌పై అభియోగాలు మాత్రమే ఉన్నాయని ఆమె అన్నారు. విజయవాడలో ఏర్పాటైన పార్టీ కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాంతీయ సదస్సులో ఆమె శనివారం ప్రసంగించారు.

డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ లక్ష్యాలను సాధించాలని ఆమె పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో జరిపితే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తలకు మంచి అవకాశమని, చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టి ఐకమత్యంతో పనిచేయాలని ఆమె అన్నారు. గ్రామాల్లో కనీస వసతులు కూడా లేవని, కార్యకర్తలు వాడవాడలా గ్రామగ్రామానా సేవ చేయడానికి ఇది మంచి అవకాశమని ఆమె అన్నారు.

సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆమె అన్నారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, నిధులు మురిగిపోతున్నాయని విజయమ్మ అన్నారు. గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఎరువుల ధరలు రైతులను కుంగదీస్తున్నాయని అన్నారు. జవాబుదారీతనం లేని ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలని ఆమె అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ఏ చార్జీలు కూడా పెంచలేదని ఆమె గుర్తు చేశారు. అంతకు ముందు ఆమె బావాజీపేటలోని ఉత్తరాఖండ్ బాధితుల కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు తగిన సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు.

English summary
The YSR Congress party honorary president and Pulivendula MLA YS Viajayamma refuted political rivals comments on her family and Bible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X