అక్రమ సంబంధం: ప్రేయసీప్రియుల దారుణ హత్య

వేటకొడవళ్లతో నీలకంఠారెడ్డి నరికి చంపారు. ప్రమీలను కూడా చంపేసి శవాన్ని ఆ పక్కనే ఉన్న పొలంలో పాతిపెట్టారు. అక్రమ సంబంధం కారణంగానే వారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదిలావుంటే, అనంతపురం జిల్లాలో మరో హత్య జరిగింది. శనివారం ఉదయం తాడిపత్రిలో రియల్టర్ ఈశ్వర్‌రెడ్డిని ప్రత్యర్థులు నరికి చంపారు. ఈశ్వర్‌రెడ్డి వద్ద ఆర్ఆర్ లారీ ట్రాన్స్‌పోర్టు యజమాని డిస్కాంశ్రీను రూ.400 కోట్లు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చమన్నందుకు ఈశ్వర్‌రెడ్డిని చర్చలకు పిలిచిన శ్రీను, ఆయన అనుచరులు కత్తులతో దారుణంగా నరికి చంపాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గోనె సంచీలో శవం
ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లా బుద్వేల్ రైల్వే స్టేషన్‌లో గోనెసంచీలో ఉన్న మృతదేహం శనివారం తీవ్ర సంచలనం సృష్టించింది. సంచి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గుర్తించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
ప్రకాశం జిల్లా మార్జూరు మండలం ఇసుకదర్శి వద్ద జాతీయ రహదారిపై ఒంగోలు వైపు వెళ్తున్న బస్సు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇసుకదర్శి గ్రామానికి చెందిన కోవి పేరయ్య (65)గా మృతుడిని గుర్తించారు.












Click it and Unblock the Notifications