భర్తను చంపిన భార్య: అత్తాభార్యలను చంపిన వ్యక్తి

మరణించిన వ్యక్తి మెడకు తాడు వేిస ఇంటిలో దూలానికి వేలాడదీసి ఉంది. అతని భార్య ప్రస్తుతం పరారీలో ఉంది. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నరసంహిుడు ట్రాన్స్‌కోలో సహాయ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు.
ఇదిలావుంటే, పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో శనివారం ఉదయం దారుణ సంఘటన జరిగింది. పోచమ్మ అనే 30 ఏళ్ల మహిళపై అతని భర్త రవి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన అత్త కళ్లేపల్లి లక్ష్మి (45)పై దాడి చేశాడు. దీంతో లక్ష్మి అక్కడికక్కడే మరణించింది.
రవి భార్య పోచమ్మ తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, మెదక్ జిల్లా పుల్కల్ మండలం శివ్వంపేటలో ప్రమాదవశాత్తు కిరాణాదుకాణం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్ యాదవ్ అనే 28 ఏళ్ల యువకుడు సజీవదహనమయ్యాడు.












Click it and Unblock the Notifications