3 రోజుల్లో పిఎం పర్యటన: శ్రీనగర్‌లో టెర్రరిస్టుల దాడి

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నడిబొడ్డున మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. రద్దీగా ఉండే హరి సింగ్ హై స్ట్రీట్‌లో మిలిటెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ మరో మూడు రోజుల్లో జమ్మూ కాశ్మీర్ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం కలకలానికి దారి తీసింది.

సైలెన్సర్లు బిగించిన పిస్టల్స్‌తో ఉగ్రవాదులు ఒకేసారి జహంగీర్ చౌక్, సరాయ్ బాలాలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మొహమ్మద్ మక్బూల్, కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ గాయపడ్డారు.

Jammu and Kashmir

ఆస్పత్రికి తరలిస్తుండగా మక్బూల్ మరణించాడు. ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసిన తర్వాత నజీర్ అహ్మద్ మరణించాడు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ నెల 25వ తేదీన కాశ్మీర్ లోయలో పర్యటించాల్సి ఉంది.

ప్రధాని జూన్ 25వ తేదీన బనిహాల్, ఖాజీగుండ్ మధ్య రైలు సర్వీసును ప్రారంభిస్తారు. ఆ వెంటనే తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+