ఘాతుకం: పాకిస్తాన్ సినీ నటిపై యాసిడ్ దాడి

ఇస్లామాబాద్‌కు 148 కిలోమీటర్ల దూరంలో గల నౌషెరాలోని తన ఇంటిలో నిద్రిస్తుండగా బుష్రాపై యాసిడ్ దాడి జరిగింది. శనివారం ఉదయం పూట ఓ వ్యక్తి ఆమె ఇంటి గోడపైకి ఎక్కి, యాసిడ్ దాడి చేసి పారిపోయాడని బుష్రా సోదరుడు పర్వేజ్ ఖాన్ చెప్పాడు. పోలీసులు కూడా దీన్ని ధ్రువీకరించారు.
బుష్రాను వెంటనే పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె శరీరం 33 శాతం కాలిపోయినట్లు వైద్యులు చెప్పారు. ముఖం, భుజాలపై కాలినట్లు, ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వారు తెలిపారు.
స్థానిక టీవీ డ్రామా నిర్మాత షౌకత్ ఖాన్‌పై బుష్రా సోదరుడు పర్వేజ్ ఖాన్ ఫిర్యాదు చేశాడు. పెళ్లికి నిరాకరించడంతో షౌకత్ తన సోదరి పట్ల అసంతృప్తితో ఉన్నాడని ఆయన చెప్పాడు. నిరుడు పాకిస్తానీ గాయని ఘజాలా జావేద్‌ను సాయుధులు కాల్చి చంపారు. మాజీ భర్తతో వివాదం కారణంగా ఆమెను పెషావర్‌లోని బ్యూటీ సెలూన్ నుంచి బయటకు వస్తుండగా కాల్చి చంపారు.












Click it and Unblock the Notifications