తెలంగాణ: కేంద్రమంత్రులు చిద్దూ, షిండేలపై 420 కేసు

2009 డిసెంబర్ 9వ తారీఖు కేందమంత్రి చిదంబరం తెలంగాణపై చేసిన ప్రకటనను, అదే నెల 23న వెనక్కి తీసుకున్నారు. గతేడాది డిసెంబరు 28న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం చెబుతామని ప్రకటించారు. ఆ తర్వాత ప్రకటన రాలేదు. దీంతో తెలంగాణవాదులు తెలంగాణపై చిదంబరం, షిండేలు మాట మార్చారని కేసు పెట్టారు.
నాలుగేళ్లుగా తెలంగాణ వేడి ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలోను వేడెక్కిస్తోంది. తెలంగాణపై ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక అధిష్టానం పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని, ప్రకటించిన తెలంగాణను ఇవ్వాలని తెలంగాణ ప్రాంత నేతలు, ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ ఇవ్వక్కర్లేదని, అవసరమైతే ప్యాకేజీ ఇవ్వవచ్చునని సీమాంధ్ర నేతలు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణను తేల్చేందుకు అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ఈ నెలాఖరులోగా తెలంగాణపై తేల్చేసే అవకాశాలున్నాయి. భారీ ప్యాకేజీ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉత్తరాఖండ్ వరద బీభత్సం నేపథ్యంలో ఇంకొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.












Click it and Unblock the Notifications