వరదలు: బాబు ధర్నాపై దానం ఫైర్, కిరణ్‌కు నో పర్మిషన్

రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎంతో చేశారని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నాలు, ఆందోళనలతో రాజకీయ లబ్ధి కోసం చూడటం దారుణమన్నారు. బాబువి దిగజారుడు రాజకీయాలన్నారు. రాష్ట్రం నుండి రెండు హెలికాప్టర్లను, పలు వాహనాలను పంపించినట్లు చెప్పారు. వరద సహాయక చర్యలు తమ ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టిందన్నారు.
చాలామందిని సురక్షితంగా ఇంటికి చేర్చామని చెప్పారు. ఏ రాష్ట్రం చేయని విధంగా ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఏరియల్ సర్వేకు అనుమతి లేకపోవడం వల్లనే కిరణ్ వెళ్లలేదని చెప్పారు. బాధితులకు ఆర్థిక సాయంపై ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పటికి రాష్ట్రానికి రెండు వేల మంది యాత్రికులను తరలించామని దానం నాగేందర్ ఈ సందర్భంగా చెప్పారు.
కాగా, ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు కొన్నిచోట్ల సోమవారం అడ్డంకులు ఏర్పడ్డాయి. వర్షం కురుస్తుండటంతో కొన్ని చోట్ల సైనికులు సహాయక చర్యలను నిలిపివేశారు. మృతుల ఫోటోలను వెబ్ సైట్లో పెట్టేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications