చింత చచ్చినా: బాబుపై కిరణ్, జగన్ పార్టీ ప్రై.లి. కంపెనీ

Kiran Kumar Reddy
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన విశాఖపట్నంలోని అనకాపల్లిలో విద్యాపక్షోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

చంద్రబాబుకు చింత చచ్చినా పులుపు చావలేదన్నారు. బాబు అన్ని విషయాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశాన్ని శాశ్వతంగా ప్రతిపక్షంలో ఉంచేందుకు ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారన్నారు. బిసిలకు ఎంతో చేశామని చెప్పే చంద్రబాబు వారికేమీ చేయలేదన్నారు. తాము ఈ ఒక్క ఏడాదే వారి కోసం రూ.4700 కోట్ల రుణాలు ఇస్తున్నామన్నారు. మైనార్టీలకు కూడా తాము బాబు కంటే, గత ప్రభుత్వం కంటే ఎక్కువే చేస్తున్నామన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓ ప్రయివేట్ లిమిటెండ్ కంపెనీ అన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుటుంబ పార్టీలు అన్నారు. ఆ పార్టీలలో చంద్రబాబు, జగన్ తప్ప మరొకరు ముఖ్యమంత్రి కాలేరన్నారు. కాంగ్రెసులో మాత్రం అలా కాదన్నారు. అలాంటి ప్రయివేటు లిమిటెండ్ కంపెనీలకు ప్రజలు మద్దతివ్వవద్దని కోరారు. అప్పుడే వారు దుకాణం ఎత్తేస్తారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెసు పార్టీ అందర్నీ కలుపుకు పోతుందన్నారు. తాను చిత్తూరు జిల్లా కంటే విశాఖకే ఎక్కువగా వచ్చానని చెప్పారు. చదువుకు పేదరికం అడ్డురావద్దనే ఉద్దేశ్యంతోనే మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తొలి విడతలో 335 పాఠశాలలు, రెండో విడతలో 400 వందల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+