ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కెటిఆర్ పరువు నష్టం దావా

ఐపిసి సెక్షన్ 499 - 500ల కింద వారిపై కేసు నమోదు చేయాలని కెటిఆర్ తన పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌లో ఎ1గా ఆమోద బ్రాడ్ కాస్టింగ్ పబ్లికేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఎ2గా వేమూరి రాధాకృష్ణ, ఎ3గా కనగంటి వెంకట శేషగిరి రావు, ఎ4గా సంపాదకులు శ్రీనివాస్‌లను నిందితులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రజా ప్రతినిధిగా ఉన్న తనపై వ్యక్తిగతంగా దూషిస్తూ తమ పరువును, పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆంధ్రజ్యోతి, ఎబిఎన్ వార్తా సంస్థలు వ్యవహరించాయని పిటిషన్‌లో ఆరోపించారు. పిటిషన్ పైన విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. రాధాకృష్ణ కావాలనే తమపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తమకు న్యాయవ్యవస్థ పైన నమ్మకముందని, చట్టాలంటే గౌరవముందన్నారు. న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందన్నారు. అసత్య కథనాలు చట్ట పరిధిలో తేల్చుకునేందుకే కేసు వేసినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంపై ఆంధ్రజ్యోతి విషం చిమ్ముతోందన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు కుట్ర పన్నుతోందన్నారు.












Click it and Unblock the Notifications