కెసిఆర్ కుటుంబం నిజస్వరూపం బయటపడింది: రేవూరి

వీరంతా ఇప్పటికే తెలంగాణ సమాజం ముందు దోషులుగా నిలబడ్డారని, అక్రమాలు, సాగిస్తున్న దుర్మార్గాలు రాబోయే రోజుల్లో మరిన్ని బయటకు వస్తాయని, వీరిని ఛీకొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కెసిఆర్‌కు తెలంగాణ రావాలని ఏ కోశాన లేదని, ఆలోచనంతా సెంటిమెంట్‌తో ఎట్లా లాభం పొందుతామా అనే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాల్లో తెరాసను గెలిపించాలని కోరుతున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు.. గంపగుత్తగా అధికారం ఇస్తే చెన్నారెడ్డిలాగా ఆ సీట్లన్ని సోనియాకు తాకట్టెలని చూస్తున్నారమండిపడ్డారు.
జయశంకర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనే తీరిక కెసిఆర్‌కు లేదాఅని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో కెటిఆర్ పాల్పడుతున్న భూదందాలు, సెటిల్‌మెంట్ల బాగోతాన్ని సాక్ష్యాలతో బయట పెడితే... దానికి సమాధానం ఇవ్వాల్సింది పోయి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడమేకాక, బెదిరింపులకు పాల్పడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. కెటిఆర్‌కు ఉద్యమ నాయకుడికి ఉండాల్సి న లక్షణాలు, సంస్కారం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
తప్పులు ఎత్తి చూపినప్పుడు వాటికి తగిన విధంగా వివరణ ఇవ్వాల్సి పోయి, సీమాంధ్ర మీడియా అని విరుకుపడడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పులను బయటపెట్టేవారంతా తెలంగాణ ద్రోహులుగా ప్రచారం చేయడం ఆయన నీచ సంస్కృతిని నిదర్శనమన్నారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కెసిఆర్ ఇప్పుడు కాంగ్రెస్‌కు కాపలా కుక్కలా మారిపోయారన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు కష్టకాలం వచ్చినప్పుడలా ఏదో గొడవను సృష్టించి సభ జరగకుండా చేయడం ద్వారా ఆ పార్టీని కాపాడుతున్నది తెరాస కాదా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి టిడిపిని వదిలి వెళ్ళినా ఆర్థిక లావాదేవీలను మాత్రం వదులుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications