జైలు అధికారి కూతురు ఆత్మహత్య: వ్యక్తి హత్య, దోపిడీ

యువతి ఆత్మహత్య
కృష్ణా జిల్లా విజయవాడ జైలు సూపరింటెండెంట్ కూతురు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఎబిబిఎస్ చదువుకుంటున్నారు.
మహిళ ఆత్మహత్య
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో భారతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని చెబుతున్నారు.
హత్య చేసి రూ.7 కోట్లు దోపిడీ
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ కాంట్రాక్టు ఉద్యోగిని హత్య చేసి రూ.7 కోట్లు ఎత్తుకెళ్లిన సంఘటన చోటు చేసుకుందగి. ఓ సెక్యూరిటీ సంస్థకు చెందిన శ్రీనివాస్ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఎటిఎంలను పర్యవేక్షిస్తుంటాడు. ఈ రోజు అతను కార్యాలయంలో ఫ్యాన్‌కు వేలాడుతూ చనిపోయి కనిపించాడు. కార్యాలయంలో ఉన్న ఏడు కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లారు. శ్రీనివాస్ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగినట్లుగా తెలుస్తోంది.
ఆదివారం రాత్రి సెక్యూరిటీ సిబ్బంది ఒకరు సెలవు పెట్టడంతో శ్రీనివాస్ కార్యాలయంలోనే నిద్రించాడు. ఉదయం మాత్రం అతడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అధికారులు రాజమండ్రి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications