వైయస్‌కు దోచుకోవడం తెలియదు: విజయమ్మ

లక్ష కోట్ల రూపాయలతో వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పథకం ప్రవేశపెట్టారని ఆమె గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకూడదని ఆమె అన్నారు. ప్రజల్లో పార్టీకి మంచి ఆదరణ ఉందని చెప్పారు. రిజర్వేషన్లలో అక్రమాలు జరిగితే కోర్టుకు వెళ్తామని ఆమె చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిని కూడా ప్రజలకు వివరించాలని ఆమె పార్టీ కార్యకర్తలకు సూచించారు.
ఆరోగ్యశ్రీలో వందకుపైగా వ్యాధులను తొలగించారని, 108కి ఫోన్ చేస్తే వాహనం ఎప్పుడు వస్తుందో తెలియదని విజయమ్మ అన్నారు. గ్రామసభల అనుమతి లేకుండానే పనులు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. కరెంట్ కోతలతో గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలంటే భయంలేదని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారని, కిరణ్ కుమార్ రెడ్డి భయం ఎవరికి కావాలని అన్నారు.
కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయని అన్నారు. తన ప్రభుత్వ హయాంలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గ్రామపంచాయతీలకు నిధులు ఎందుకని అన్నారని ఆమె గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్ోల కూడా కుమ్మక్కు కుట్రలు సాగుతున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఎందుకు ఓటేయాలని ఆమె అడిగారు.
ఉత్తరాఖండ్ ప్రకృతి వైపరీత్యంలో మరణించినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తమ పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు వరద బాధితులకు ఒక నెల జీతం విరాళంగా ఇస్తారని ఆమె ప్రకటించారు.












Click it and Unblock the Notifications