వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిరికివాళ్ల చర్య: ప్రధాని, ఉగ్రదాడిలో రాష్ట్ర జవాన్ మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
శ్రీనగర్: ఉగ్రవాద చర్యలను భారత్ సమర్థవంతంగా, సంఘటితంగా ఎదుర్కొంటుందని, దాడులు పిరికివారి చర్య అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు జమ్మూ కాశ్మీర్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ సమస్య పరిష్కారానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు.

మరోవైపు నిన్న ఉగ్రవాదుల దాడిలో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. వారిలో ఒకరు ఆంధ్రా జవాన్ కూడా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యాదయ్య ఈ ఉగ్రదాడిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని రేపు హైదరాబాదుకు తరలించనున్నారు.

ప్రధాని పర్యటనకు 24 గంటల ముందు ఉగ్రవాదులు పెట్రేగిపోయిన విషయం తెలిసిందే. ఆర్మీ కాన్వాయ్‌పైనే ఉగ్రవాదులు సోమవారం కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 8 మంది జవాన్లు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దాడి జరిపింది తామేనని హిజ్బుల్ ముజాహిదీన్ ప్రకటించుకుంది.

జమ్మూ కాశ్మీరులో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడిని ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే ఖండించారు. ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలన్న భద్రత దళాల స్తైర్యాన్ని ఇటువంటి పిరికిపంద చర్యలు అడ్డుకోలేవని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడిని బిజెపి కూడా తీవ్రంగా ఖండించింది.

English summary
Prime minister Manmohan Singh and Congress President Sonia Gandhi who arrived in Jammu and Kashmir, adressing a rally in Kishtwar this morning, Manmohan singh said, "We are as a country firmly united against terrorism and will not let terrorists succeed."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X