విభజించి తలలు పగులగొట్టుకోలేం: టిజి వెంకటేష్

TG Venkatesh
హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించి తలలు పగులగొట్టుకోలేమని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశం తర్వాత ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ నేతలవి కడుపు నిండిన మాటలని, అభివృద్ధి చెందిన తర్వాత తెలంగాణ కావాలని అంటున్నారని ఆయన అన్నారు.

డిసెంబర్ 9వ తేదీన చేసినటువంటి ప్రకటన కేంద్రం నుంచి మళ్లీ వస్తే అధిష్టానం నిర్ణయాన్ని మారుస్తామని ఆయన అన్నారు. అయినా, తమ అభిప్రాయాన్ని తీసుకోకుండా తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసుకోదని ఆయన అన్నారు. రాష్ట్ర సమైక్యంగానే ఉంటుందని తాము ప్రజలకు చెప్పదలుచుకున్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకుల్లో విభేదాలు లేవని ఆయన అన్నారు. విభజన ప్రారంభిస్తే చాలా ముక్కలు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.

ఉహాగానాలతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పాలని తాము నిర్ణయించుకున్నట్లు రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం ప్రకటిస్తే రాజీనామాలు చేస్తారా అని మీడియా ప్రతినిధుల అడిగితే అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తామని ఆయన సమాధానమిచ్చారు. ఈ నెల 30, 1 తేదీల్లో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌కు తాము విశాఖపట్నం, హైదరాబాదుల్లో సమైక్య నినాదం వినిపిస్తామని చెప్పారు.

కావూరి సాంబశివరావు కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడారని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కావూరి తనదైన శైలిలో చేయాల్సిన పని చేస్తారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కావూరి సాంబశివరావు అన్నట్లు కాంగ్రెసు శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన అనేది భూములు పంచుకోవడం లాంటిది కాదని, మనుషులకు సంబంధించిన వ్యవహారమని శైలజానాథ్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవడానికి సీమాంధ్ర మంత్రులు, శానససభ్యులు శుక్రవారం సమావేశమయ్యారు. రాజీనామాలు చేసే విషయంపై కూడా సమావేశంలో చర్చ సాగినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+