మత్తుమందుతో యువతి కిడ్నాప్‌కు యత్నించిన డ్రైవర్లు

Auto driver tries to kidnap girl
గుంటూరు/చిత్తూరు: గుంటూరు జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. నగరంలోని ఓ ఇంటర్ విద్యార్థినికి ఇద్దరు ఆటో డ్రైవర్లు మత్తు మందు ఎక్కించి ఆటోలో ఎక్కించే ప్రయత్నాలు చేశారు. ఆమె అరవడంతో వారు పరారయ్యారు. గుంటూరులోని గోరంట్ల సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న బాధితురాలిని అడ్డుకున్న ఇరువురు ఆటో డ్రైవర్లు ఆమెకు మత్తు మందు ఇచ్చారు. ఆమెను బలవంతంగా ఆటో ఎక్కించాలనుకుంటే, దానిని గుర్తించిన ఆమె అరిచింది. అక్కడకు స్థానికులు వస్తుండటం చూసిన నిందితులు పరారయ్యారు. ఆమెను జిజిహెచ్ ఆసుపత్రికి తరలించారు.

యువకుడిపై ఎలుగుబంటి దాడి

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అడవులలో నెక్కెంటి సమీపాన ఓ ఎలుగుబంటి యువకుడిపై దాడి చేసి గాయపర్చింది. తీవ్రంగా గాయపడిన అతనిని ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

చిత్తూరు జిల్లాలో..

చిత్తూరు జిల్లాలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని పైన ఓ పశువుల కాపరి అత్యాచారం చేసి, హత్య చేశాడు. టివిఎస్ఆర్ పురంలో ఈ ఘటన జరిగింది. గురువారం పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినిపై అత్యాచారం చేసిన అతను ఆమెపై దాడి చేశాడు. ఆమె అరవడంతో స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వారు వచ్చేలోగా ఆమె మృతి చెందింది. పశువుల కాపరి చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తుండేవాడు.

కాగా, నలుగురు మైనర్లు పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఇది ఆలస్యంగా వెలుగు చూసింది. హనుమాన్ నగర్‌లో ఉండే బాలికకు తీవ్ర జ్వరం రావడంతో గతవారం ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరిశీలించడంతో ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+