ఇంట్లో బిపివో వర్కర్: బయట చోర్, 25 ఇళ్ల దోపిడీ

మదురవోయలుకు చెందిన మంజునాథ్‌ను గస్తీ తిరుగుతున్న హెడ్ కానిస్టేబుల్ సోలమన్ స్టాన్లీ, హోం గార్డు మునియసామి అడ్డుకున్నారు. పలు పరికరాలు ఉన్న ల్యాప్‌టాప్ బ్యాగును అతను భుజనా వేసుకున్నాడు. అతన్ని పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. అక్కడ అతను తాను చేస్తున్న పనిపై నోరు విప్పాడు.
తాను తల్లిదండ్రులతో కలిసి నాలుగేళ్ల క్రితం షిమోగా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినట్లు మంజునాథ్ పోలీసులకు తెలిపారు. పన్నెండో తరగతి చదువుతున్న అతను బిపివో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి సాయంత్రం ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు వచ్చేవాడు. సైకిల్‌పై తిరుగుతూ రాత్రి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు.
తాను దొంగతనం చేసిన బంగారు నగలను టీ నగర్‌లోని ఆభరణాల దుకాణాల్లో కొత్త బంగారం నగలతో మార్చుకునేవాడు. వాటికి బిల్లులు తీసుకునేవాడు. చిన్నప్పటి నుంచే మంజునాథ్‌కు చోరీలు చేసే అలవాటు ఉందని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications