కావూరితో కెటిఆర్ భేటీ: 'చేనేత ఇప్పుడు గుర్తొచ్చిందా?'

చేనేత, టెక్స్‌టైల్స్ కార్మికుల సమస్యల విషయమై తాను కావూరిని కలిశానని చెబుతున్న కెటిఆర్‌కు చేనేత సమస్యలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమైక్యవాదులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసలైన అడ్డంకి కెసిఆర్, టిఆర్ఎస్ అని గజ్జెల కాంతం ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు సభతో జిమ్మిక్కులు చేయకుండా, అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు వెళ్లి తెలంగాణపై ప్రకటన చేయించాలన్నారు.
మభ్యపెట్టేందుకే: జూపల్లి
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఈ రోజు తెలంగాణ సాధన సభను నిర్వహిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు ఆరోపించారు. కెసిఆర్, తెరాస వల్ల తెలంగాణ ఎప్పుడో వచ్చిందని, కాంగ్రెసు నేతల వల్లనే అది వెనక్కి పోయిందన్నారు.
తెలంగాణ రాని పక్షంలో తెలంగాణ సాధన సమితి సభను పెడుతున్న నేతలు ఏం చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మానవత్వం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు.
ఎన్నికల కోసమే: నాగం
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల తెలంగాణ సాధన సభ ఎన్నికల కోసమేనని భారతీయ జనతా పార్టీ నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ ఇవ్వని కాంగ్రెసు ఇప్పుడు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications