వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది బ్లాక్‌మెయిలని ఏరాసు: జగన్, బాబుకు బైరెడ్డి ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Byreddy Rajasekhar Reddy - Erasu Pratap Reddy
హైదరాబాద్: తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతూనే కాంగ్రెసు పార్టీ నేతలు పోటీపోటీగా సభలు, సమావేశాలు పెట్టడం అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేయడమేనని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి సోమవారం అన్నారు. రాష్ట్రంలో ఉన్న తెలంగాణ సమస్యను పరిష్కరించారని కోరుతూనే, రాష్ట్ర నేతలు సమస్యలు సృష్టించడం సరికాదన్నారు. తెలంగాణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టిబడి ఉంటామని చెప్పారు.

కెసిఆరే చెప్పారు: టిజి

ఎన్నికల దాకా తెలంగాణ రాదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే స్వయంగా చెప్పారని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటున్నట్లుగా అధిష్టానం తమతో ఎప్పుడు చెప్పలేదన్నారు అలాంటప్పుడు రాయల తెలంగాణ, తెలంగాణ అంటూ ప్రస్తావన ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తామని అధిష్టానం తమతో చెబితే వెళ్లి కలుస్తామన్నారు. అందుబాటులో ఉన్న నేతలం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కలుస్తామన్నారు.

ఆ ముగ్గురు నోరు విప్పరేం? బైరెడ్డి

రాయల తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాయలసీమ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సోమవారం కర్నూలులో అన్నారు. రాయల తెలంగాణకు మొగ్గు చూపే ప్రమాదం ఉందన్నారు.

అదే జరిగితే రాయలసీమ ప్రాంతం నష్టపోక తప్పదన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెదవి విప్పడం లేదన్నారు. సీమ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.

English summary
Minister Erasu Pratap Reddy on Monday blamed that state Congress leaders are blackmailing High Command with the name of meetings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X