'జగన్ పార్టీ పరిస్థితి చిరంజీవి ప్రజారాజ్యం కంటే దారుణం'

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఒకటేనని రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెప్పకనే చెప్పారన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఎప్పటికైనా కాంగ్రెసు పార్టీలో కలిపేస్తారన్నారు. మూడు నెలల క్రితం వైయస్ భారతి, సుబ్బా రెడ్డిలు ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే ప్రయత్నం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
జగన్ పార్టీ పరిస్థితి పిఆర్పీ కంటే దారుణమన్నారు. తెలుగు వారి క్షేమం కంటే వైయస్ కుటుంబ సంక్షేమమే ఆ పార్టీకి ముఖ్యమన్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం దారుణమన్నారు. తెలుగోళ్ల గోడు ఆ పార్టీకి పట్టదన్నారు.
పొత్తుపై నారాయణ
వచ్చే ఎన్నికలలు కాంగ్రెసు, బిజెపిలతో పొత్తు ఉండదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విశాఖలో అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సన్నద్ధమవుతున్నామని, సిపిఎం, టిడిపిలతో పొత్తుకు సిద్ధమని చెప్పారు. కాంగ్రెసు పార్టీ తమ విధానాలను మార్చుకొని మాట్లాడితే బాగుండేదన్నారు.












Click it and Unblock the Notifications