నీళ్ల బాటిల్: అమ్మాయితో మూత్రం తాగించిన విద్యార్థులు

Boys urinate in girl's water bottle
గుంటూరు: ముగ్గురు విద్యార్థులు తోటి విద్యార్థినికి మూత్రం తాగించిన ఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. గుంటూరులో 10వ తరగతి విద్యార్థులు అమ్మాయికి మూత్రం తాగించి ర్యాగింగ్ చేశారు. నగరంలోని ఆర్ అగ్రహారం మున్సిపల్ స్కూల్‌లో ఆకతాయిలు ఈ పని చేశారు.

పదవ తరగతి విద్యార్థ్ధిని పైకి తోటి విద్యార్థ్ధి ఒక చిన్న పిల్లాడిని నెట్టాడు. దీంతో ఆమె ఆ విద్యార్థ్ధిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై ఆ విద్యార్థ్ధి కక్ష పెంచుకుని మరో ఇద్దరితో కలిసి ఆ విద్యార్థిని మంచి నీళ్ల బాటిల్‌ను తీసుకొని అందులోని నీటిని తీసివేసి, మూత్రం పోసి ఉంచాడు.

ఆ విద్యార్ధినిని బాటిల్‌లో ఉన్న మూత్రం తాగి వాంతులు చేసుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలించగా మూత్రం తాగినట్లు వైద్యులు వెల్లడించారు. పాఠశాల యాజమాన్యం ముగ్గురు విద్యార్థులను గుర్తించి వారికి టిసిలు ఇచ్చి పంపేశారు. ఈ ఘటన గత నెల 28వ తేదిన జరిగింది. తల్లితండ్రులు, ప్రధానోపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎలుగుబంటి హల్‌చల్

చిత్తూరు జిల్లా తిరుమలలో సోమవారం సాయంత్రం ఓ ఎలుగుబంటు హల్‌చల్ చేసింది. శంకుమిట్ట నామాలపార్కు నుంచి రోడ్డు పైకి వచ్చి పద్మావతినగర్‌కు వెళ్లే దారిన పరుగులు తీసింది. దీనిని గమనించి పాదచారులు, వాహనదారులు భయాందోళనతో పరుగులు తీశారు. పద్మావతి ఉద్యానవనంలో పనిచేస్తున్న టిటిడి సిబ్బంది ఆ ఎలుగుబంటును అడవిలోకి తరిమేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+