ఎవరి కాళ్లు పట్టుకోలేదు, పదవి కాంక్ష లేదు: కావూరి

 Kavuri Sambasivarao
ఏలూరు: తనకు పదవి కాంక్ష లేదని, వాటి కోసం ఎవరి కాళ్లు పట్టుకోలేదని కేంద్ర జౌళీ శాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు మంగళవారం అన్నారు. కేంద్రమంత్రిగా ఆయన తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చారు. ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ఆయనకు జిల్లా నేతలు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తాను పదవి కోసం ఎవరి కాళ్లు పట్టుకోలేదన్నారు. కేంద్రమంత్రిగా దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు లభించిందని అన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలని తాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

చేనేత కార్మికులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. పదవి కన్నా పేద ప్రజల మధ్య గడపడంలోనే తనకు ఆనందం ఉందన్నారు. తాను కాంగ్రెసు పార్టీకి నిత్యం కార్యకర్తగానే పని చేశానని, ఏనాడు పదవి కోసం ఎదురు చూడలేదన్నారు.

కొల్లేరులో ధ్వంసం చేసిన చేపల చెరువులను పునరుద్ధరించడానికి, కాంటూరు 5 నుంచి 3కు కుదించి 40వేల ఎకరాలను కొల్లేరువాసులకు పంపిణీ చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కావూరి కొల్లేరు సమస్యను పరిష్కరిస్తే తాను ఎంపికి, కాంగ్రెసు పార్టీకి బాసటగా నిలుస్తానని టిడిపి కైకలూరు ఎమ్మెల్యే వెంకటరమణ చెప్పారు.

ఎవరు ఎలాంటి నివేదిక ఇచ్చినా తెలంగాణ ఖాయం: సారయ్య

ఎవరు ఎలాంటి నివేదిక ఇచ్చినా తెలంగాణ ఖాయమని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. పంచాయతీ ఎన్నికలకు, తెలంగాణకు సంబంధం లేదన్నారు. కావూరి సాంబశివ రావు లాంటి వారే తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడుతామని చెప్పారని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+