జగన్ చక్రం తిప్పుతారు: గోనె, 'టిడిపి, జగన్ పార్టీ డౌట్'

Gone Prakash Rao and Sailajanath
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 2014లో అధికారంలోకి వస్తారని, ఇరవై ఏళ్ల పాటు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ్ రావు గురువారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిఎన్ఏ కాంగ్రెసుదే అన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకులు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై గోనె మండిపడ్డారు.

కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిఎన్ఏ ఏమిటో స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెసు పార్టీని వీడిన వారు చాలామంది ఆ పార్టీని మట్టి కరిపించి సందర్భాలు ఉన్నాయని, దేశ ప్రధానులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తారన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా రెండు ప్రాంతాల్లో తమ పార్టీదే విజయమన్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లోను అదే విషయం వెల్లడైందన్నారు. రాష్ట్ర విభజనను కాంగ్రెసు పార్టీ సీట్లతో లెక్కలు వేస్తోందన్నారు. విభజనతో ఫలితాలు అనుకూలంగా రావని ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలతో రుజువైందన్నారు. గతంలో జార్ఖండ్‌ను ఏర్పాటు చేసిన బిజెపి అక్కడ గెలువలేకపోయిందన్నారు.

బైరెడ్డి దీక్షకు మద్దతు

ఇందిరాపార్కులో బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేపట్టిన దీక్షకు రాయలసీమ ప్రాంత నాయకులు, ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుండి పెద్ద ఎత్తున విద్యార్థి నేతలు తరలి వచ్చారు. మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మారెప్ప మద్దతు ప్రకటించారు. దీక్ష ప్రాంగణానికి వచ్చిన ఆయన రాయలసీమను చరిత్ర హీనం చేసేందుకే రాయల తెలంగాణ అంటున్నారని మండిపడ్డారు. సీమను ముక్కలు చేస్తే ఊరుకోమన్నారు.

టిడిపి, జగన్ పార్టీ డౌట్: శైలజానాథ్

తెలంగాణ అంశంపై కేంద్రం ఓ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఎవరు మాట్లాడినా ఫలితముండదని, ఇప్పుటే సమైక్యాంధ్ర కోసం ప్రయత్నాలు చేయాలని మంత్రి శైలజానాథ్ గురువారం అన్నారు. సమైక్యవాదులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి నేతల తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. రెండో వారంలో సమైక్య సదస్సు నిర్వహిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+