విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాగ్రత్త! ఎన్నికల్లో గెలిస్తే జగన్ బయటకొస్తాడట: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయవాడ: పంచాయతీ ఎన్నికలలో గెలిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని, అలాంటి అవినీతి పార్టీకి ఓటేయవద్దని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం విమర్శించారు. విజయవాడలో టిడిపి రెండో ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

జగన్ పార్టీకి ఓటేస్తే అవినీతికి ఓటు వేసినట్లేనన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీది కాంగ్రెసు డిఎన్ఏనే అని రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు... ఈ రెండు డిఎన్ఏలు దేశాన్ని దోచుకునేవేనని ఎద్దేవా చేశారు.

పంచాయితీ ఎన్నికల్లో మంచి నేతను ఎన్నుకుంటేనే పంచాయితీల రూపురేఖలు మారుతాయని, ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అవినీతిపరులను గ్రామాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే టిడిపి పని చేస్తోందని తెలిపారు. పంచాయితీలను బలోపేతం చేయడానికే ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అవినీతిపరులను గ్రామాలకు దూరంగా ఉంచాలని, ఎన్నికలలో ఓడించాలని పిలుపునిచ్చారు.

తాను అమెరికాలో ఉన్నప్పుడు తాను వచ్చేసరికి ఉత్తరాఖండ్ వరదల గురించి తెలిసిందని, తాను వచ్చేసరికి సహాయ చర్యలు చేపడతారని భావించాని, వచ్చాక కూడా పరిస్థితి అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను చూస్తే గుండె తరుక్కుపోయిందని, అందుకే బాధితులను అదుకునే విషయంలో ముందున్నామన్నారు. చార్ ధామ్ యాత్రకు వెళ్లిన వారిలో ఇంకొంత మంది ఆచూకి లేదన్నారు.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu has said on Thursday in Vijayawada that don't support YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X