వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో స్త్రీపై పాక్ క్రికెట్ ఉద్యోగి లైంగిక వేధింపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Pakistan masseur in sexual harassment controversy
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు చెందిన ఓ ఉద్యోగి లండన్‌ హోటల్లో పనిచేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అతను పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఒళ్లు మర్దన చేసే కార్యం నిర్వహించే ఉద్యోగి. పాక్ క్రికెట్ జట్టు దిగిన హోటల్లో అతను ఆ హోటల్‌కు చెందిన మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

మలంగ్ అలీ అనే ఆ వ్యక్తిని ఆరోపణలు వచ్చిన వెంటనే స్వదేశానికి తిరిగి పంపించారు. అతని భార్య జబ్బు పడిందనే సాకు చెప్పి అతన్ని పాకిస్తాన్‌కు తిరిగి పంపించారు. తమ మహిళా వర్కర్‌ను మలంగ్ అలీ అనే పాక్ జట్టు ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నట్లు హోటల్ యాజమాన్యం పాకిస్తాన్ క్రికెట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.

ఆ ఫిర్యాదుపై జట్టు యాజమాన్యం విచారణ జరిపి, ఆరోపణల్లో నిజం ఉందని తేల్చుకుని అతన్ని వెంటనే పాకిస్తాన్‌కు పంపించి వేశారు. పాకిస్తాన్ క్రికెట్ మరో దుమారంలో ఇరుక్కోకుండా, చట్టపరమైన చిక్కులు రాకుండా చూసుకోవడానికి అతన్ని వెంటనే వెనక్కి పంపించేశారు.

స్వదేశం తిరిగి వచ్చిన తర్వాత మలింగ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) విచారణ జరిపి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. విచారణ జరిపి మలంగ్‌ను బోర్డు నుంచి బదిలీ చేసినట్లు పిసిిస మీడియా మేనేజర్ నదీం సార్వర్ చెప్పారు. ఐదేళ్ల క్రితం మలేసియాలో ఐసిసి యువ ప్రపంచ కప్ పోటీలు జరిగినప్పుడు క్రికెటర్ల గది నుంచి డబ్బులు, విలువైన వస్తువులు దొంగిలించినట్లు మలింగ్‌పై ఆరోపణలు వచ్చాయి.

English summary
Pakistan cricket team masseur was sent back from the ICC Champions Trophy after being accused of sexually harassing a female worker at the London hotel, where the players stayed during the event, a source has claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X