వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెగబడ్డ తాలిబాన్లు: ఇద్దరు తెలుగు యువకులు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Two Andhra youth killed in Afghanistan
న్యూఢిల్లీ: అఫ్ఘానిసాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్ ఉగ్రవాదులు ట్రక్కుబాంబుతో ఆత్మాహుతి దాడికి దిగారు. ఆ వెంటనే మరికొందరు కాల్పులకు తెగబడ్డారు. భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరిగిందని చెబుతున్నా ఈ సంఘటనలో ఇద్దరు తెలుగు యువకులు సహా 9 మంది చనిపోయారు.

మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌వాసి గురుడు నవీన్ (25), బాల్కొం డ మండలం వన్నెల్(బి)కి చెందిన చింతకుంట సందీప్ (28)తోపాటు పశ్చిమబెంగాల్ యువకుడు చక్రవర్తి కౌశిక్ కూడా ఉన్నారు. వెంటనే నాటో నేతృత్వంలోని భద్రత దళాలు 40 నిమిషాలపాటు పోరాడి ఉగ్రవాదులందర్నీ హతమార్చాయి.

ఆ వివరాలను బుధవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఢిల్లీలో వెల్లడించారు. భారతీయుల మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశం రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన నవీన్ హైదరాబాద్‌లో కొంతకాలం ఉద్యోగం చేసి, రెండేళ్ల కిందటే అక్కడికి వెళ్లాడు.

బాల్కొండ మండలం వన్నెల్(బి)కి చెందిన చింతకుంట సందీప్ (28) ఏడాదిన్నర క్రితం బతుకుదెరువు కోసం అఫ్ఘాన్ వెళ్లాడు. మంగళవారం తన స్నేహితులతో కలిసి హోటల్‌లో టీ తాగడానికి వెళ్లిన అతను, బాంబుపేలుళ్లలో మరణించాడు. మంగళవారం నాటో సంస్థలో విధుల్లో చేరిన కొన్ని గంటల్లోనే తాలిబన్ల దాడిలో బలైపోయాడు.

English summary
In Talibans attack in Afghanistan capital Kabul two Andhra Pradesh youth killed. They are from Nizamabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X