ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!
చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన వారు ఎంతో మంది ఉంటే.. వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరించినా ఆశించిన స్థాయిలో వారిని మెప్పించలేక వెండితెరకు దూరమైన వారు ఉన్నారు. ఈ కోవకే చెందుతారు నటి "జరీనా ఖాన్". తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితురాలే. అనుకోకుండానే నటి అయిన ఈ ముద్దుగుమ్మ పలు భాషల్లో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తనదైన శైలిలో నటనతో పాటే గ్లామర్ తో కూడా కుర్రకారులో సపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ. కానీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ లో ఎదురైన చేరు అనుభవాల గురించి ఓపెన్ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.
అనుకోకుండానే కలిసొచ్చిన అవకాశం..
జరీనా ఖాన్ 1987 మే 14న ముంబైలో జన్మించారు. నటి కావాలనే కోరిక లేని జరీనా.. ఒకసారి సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'యువరాజ్' సినిమా సెట్స్‌కు వెళ్లినప్పుడు ఆయన కంటపడ్డారు. ఆమె రూపం, కళ్లు అచ్చం కత్రినా కైఫ్‌లా ఉండటంతో సల్మాన్ ఖాన్ ఆమెను తన తదుపరి చిత్రం 'వీర్' (2010) కోసం ఎంపిక చేశారు. ఈ పీరియడ్ డ్రామాతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ.. జరీనాకు వరుస అవకాశాలు వచ్చాయి.

ఆ తర్వాత 2011లో సల్మాన్ ఖాన్ నటించిన 'రెడీ' చిత్రంలో "క్యారెక్టర్ డీలా" అనే పాటలో ఆమె చేసిన డ్యాన్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన మల్టీస్టారర్ చిత్రం 'హౌస్‌ఫుల్ 2' (2012) లో నటించి తన మొదటి కమర్షియల్ హిట్‌ను అందుకున్నారు. ఈ సినిమాతో ఆమె గ్లామరస్ నటిగా బాలీవుడ్‌లో స్థిరపడ్డారు.
గ్లామర్ ట్రీట్..
2015లో వచ్చిన 'హేట్ స్టోరీ 3' జరీనా ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. అంతవరకు పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆమె, ఈ చిత్రంలో అత్యంత బోల్డ్ గ్లామరస్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత ఆమె '1921' అనే హారర్ చిత్రంలోనూ, 'అక్సర్ 2' అనే థ్రిల్లర్‌లోనూ నటించి విభిన్న జానర్లలో తన ప్రతిభను నిరూపించుకున్నారు. అంతే కాకుండా కేవలం హిందీకే పరిమితం కాకుండా జరీనా ఇతర భాషల్లోనూ రాణించారు. 2014లో 'జట్ జేమ్స్ బాండ్' అనే చిత్రంతో పంజాబీ తెరకు పరిచయమై, అక్కడ ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకున్నారు. తెలుగులో గోపీచంద్ హీరోగా వచ్చిన 'చాణక్య' (2019) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె ఒక గూఢచారి (Spy) పాత్రలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా మెరిశారు.
నటన రాకే బట్టలు విప్పుతుందంటూ..
ఇంటర్వ్యూలో జరీనా మాట్లాడుతూ.. హేట్ స్టోరీ 3లో బోల్డ్ సీన్లలో నటించిన తర్వాత నుంచి తనను తక్కువగా చూడడం ప్రారంభించారని చెప్పుకొచ్చింది. తనకు నటించడం రాదు కాబట్టే.. అలా దుస్తులు విప్పే సీన్స్ చేస్తున్నానని కామెంట్స్ చేశారని తెలిపింది. అలాగే అక్సర్ 2 చిత్రంచెబుతూ ముందుగా థ్రిల్లర్ డ్రామా కథ చెప్పారని.. కానీ షూటింగ్ కి వెళ్ళాక స్టోరీ పూర్తిగా మార్చేశారని తెలిపారు. ప్రతీ సీన్లో బోల్డ్ సన్నివేశాలు పెట్టారని.. ముద్దు సీన్స్ కూడా యాడ్ చేశారని ఓపెన్ అయ్యారు.

అంతే కాకుండా సడెన్ గా దుస్తులు తీసేయాలని అంటారని.. పొట్టి దుస్తులు ధరించాలని చెబుతారని.. తన బాధ ఎవరూ అర్థం చేసుకోరని ఎమోషనల్ అయ్యారు. అలాంటి సన్నివేశాలు చేయడం సమస్య కాదని.. ముందు ఒకటి చెప్పి గత సినిమా చూసి కావాలని ఇలాంటి సీన్లలో ఇరికించడం కరెక్ట్ కాదని అన్నారు. అలానే నిర్మాతలు సైతం అలాంటి సీన్లు చేయాలని బలవంతం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తంగా తాను సరిగ్గా నటించనని పుకార్లు పుట్టించి పేరు నాశనం చేశారని కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications