జగన్ పార్టీలోకి మోపిదేవి ఫ్యామిలీ, సోదరుడి కంట నీరు

Mopidevi Venkataramana
హైదరాబాద్: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబ సభ్యులు శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో మోపిదేవి సోదరుడు హరనాథ్ బాబు, తనయుడు రాజీవ్, ఇతర నాయకులు చేరారు. తన సోదరుడిని తలుచుకొని హరనాథ బాబు ఓ సమయంలో కన్నీళ్ల పర్యంతమయ్యాడు. తాము బిసిలమైనందువల్లనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కక్ష కట్టి తమ సోదరుడిని జైలుకు పంపించారని ఆరోపించారు. ముప్పై ఏళ్లుగా తాము పార్టీ కోసం పని చేస్తే, కష్టాల్లో ఉన్నప్పుడు తమను అదే పార్టీ విస్మరించిందన్నారు.

న్యాయ సహాయం అందించే విషయంలో కూడా ముఖ్యమంత్రి వివక్ష చూపించారన్నారు. కాంగ్రెసు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రేపల్లె నియోజకవర్గంలో, గుంటూరు జిల్లాలో మోపిదేవి బలోపేతం చేశారన్నారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా కుంటుబడ్డాయన్నారు. తన సోదరుడికి అనారోగ్యంగా ఉననా వైద్య సహాయం కూడా సరిగా అందడం లేదని హరనాథ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

తాము ఏదో ఆశించి పార్టీలో చేరలేదన్నారు. తన అన్నను కాంగ్రెసు పార్టీ మోసం చేసిందన్నారు. తన సోదరుడి విషయంలో నీచంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ స్థానాలు గెలిచి విజయమ్మకు కానుకగా ఇస్తామన్నారు. 2014లో జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.

కాగా, మోపిదేవి అనుచరులు బుధవారం కాంగ్రెసు పార్టీని వీడిన విషయం తెలిసిందే. వెంకటరమణ సోదరుడు, మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, మోపిదేవి అభిమానులు మాజీ మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బిసి వర్గాలకు చెందిన మోపిదేవికి కాంగ్రెసు పార్టీ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. రేపల్లె నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేసిన వ్యక్తి ఆయన అన్నారు.

అలాంటి వ్యక్తికి కాంగ్రెసు పార్టీ నాయకులు, ఢిల్లీ నేతలు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మోపిదేవిని పార్టీ పట్టించుకోనందు వల్లనే తాము పార్టీని వీడుతున్నట్లు హరనాథ్ బాబు, ఇతర నేతలు చెప్పారు. తామంతా మోపిదేవి బాటలోనే నడుస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+