తెలంగాణకు రాజకీయ సమస్యలు: ఎంపి అనంత వ్యాఖ్య

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తాము దిగ్విజయ్‌ను కోరినట్లు చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదన లేదన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి రాజకీయ సమస్యలు ఉన్నాయన్నారు. వాటి పరిష్కారంపై అధిష్టానం సమాలోచనలు చేస్తోందన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణపై రాజకీయ అనిశ్చితి తొలగించాలనే ఉద్దేశ్యంతో పార్టీ అధిష్టానం ఉందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను తాము ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. త్వరలో అనంతపురం జిల్లాలో, కోస్తాలోని ఓ జిల్లాలో సమైక్య సభను పెడతామన్నారు.
జెఏసి నేతలకు విహెచ్ విందు
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేతలకు రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ఈ రోజు విందు ఇచ్చారు. ఈ విందులో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెసు పార్టీ తెలంగాణలో 15 సీట్లను గెలుచుకుంటుందన్నారు. కేంద్రంలో యూపిఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications