విషాదం: తెలంగాణ కోసం అమ్మాయి ఆత్మహత్య

బుధవారం సాయంత్రం శిరీష పురుగుల మందు తాగడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శిరీష గురువారం మృతిచెందింది. తెలంగాణపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని, ఇక తెలంగాణ రాదేమోనని అన్పించడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె బ్యాగులో లభించిన ఓ సూసైడ్ నోట్‌లో రాసి ఉంది.
తెలంగాణ రాకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించింది. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు ఇస్తున్న మాటలను నమ్మవద్దని, పంచాయతీ ఎన్నికల కోసం కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని ఆమె తన సూసైడ్ నోట్‌లో రాసింది. తెలంగాణ కోసం తనదే చివరి మరణం కావాలని ఆమె ఆశించింది.
మృతురాలి మేనమామ నర్సింహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications