కెసిఆర్‌పై హెచ్చార్సీకి అన్న కూతురు రమ్య ఫిర్యాదు

తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూడా అయిన వేగులపాటి రమ్య ఇటీవల ఓ కార్యక్రమంలో కెసిఆర్‌పై విమర్శలు చేశారు. తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతాస్వామి ఆధ్వర్యంలో జరిగిన వెయ్యి డప్పులు - లక్ష చెప్పులు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ఆ విమర్శలు చేశారు. దానికి ఆగ్రహించి - కరీంనగర్‌లోని బ్యాంక్ కాలనీలో రమ్య ఫంక్షన్ హాల్ పైన టిఆర్ఎస్ మహిళా కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే.
మంగళవారం బషీర్‌బాగ్‌లో జరిగిన 'వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు' కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వెళ్లానని ఆమె తెలిపారు. అక్కడ తన ఎడమ కాలి చెప్పు అడిగితే ఇచ్చానన్నారు. ఈ కారణంగానే కెసిఆర్ తన ఫంక్షన్ హాల్‌పై దాడి చేయించారని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
తెలంగాణ రాక ముందే కెసిఆర్ ఇలా ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రవర్తన ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలు ఊహించుకోవాలని ఆమె అన్నారు. డిజిపిని కలిసి కెసిఆర్‌పై ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఈ దాడి ఘటన కెసిఆర్ విజ్ఞతకే వదిలివేస్తున్నానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications