విశాఖ జిల్లాలో 200 రోజులు దాటిన షర్మిల నడక

ఈ యాత్ర శుక్రవారం ముగిసే సమయానికి ఆమె మొత్తం 2664.8 కిలోమీటర్ల దూరం పాదయాత్రను పూర్తి చేశారు. అలాగే, 1565 గ్రామాల్లో పర్యటన పూర్తి చేస్తారు. 194 రచ్చబండలను, 159 మండలాల్లో, 143 బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అదేవిధంగా 100 సెగ్మెంట్లు, 38 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లలో ఆమె పర్యటన సాగనుంది.
ఒక మహిళ చేపట్టిన పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోవడం రికార్డుగా పరిగణిస్తున్నారు. అనూహ్య పరిణామాల మధ్య షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టారు. జగన్ అరెస్టు అయిన తర్వాత ఆమె జనంలోకి వచ్చారు. 2012 అక్టోబర్ 18న షర్మిల ఇడుపులపాయలో ఈ పాదయాత్ర ఆరంభించారు.
షర్మిల మరో ప్రజాప్రస్థానం యాత్ర 11 జిల్లాలు దాటుకుని గత నెల 24వ తేదీన గన్నవరం మెట్ట వద్ద విశాఖపట్నం జిల్లాలోకి అడుగు పెట్టింది.












Click it and Unblock the Notifications