జగన్, చంద్రబాబులకు ముందస్తు ఎన్నికల భయం

Chandrababu and Ys Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ముందస్తు లోకసభ ఎన్నిలక భయం పట్టుకుంది. నిజానికి, శాసనసభ, లోకసభలకు ఒకేసారి వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరగాల్సి ఉండింది. అయితే, నవంబర్‌లోనే లోకసభ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెసు అధిష్టానం భావించి, అందుకు అనువైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

శానససభ ఎన్నికలను లోకసభ ఎన్నికలతో విడగొట్టడం వల్ల తాము నష్టపోతామనే భయం వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని ఆశపడుతూ గణనీయమైన సంఖ్యలో లోకసభ స్థానాలను గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాయి.

అయితే, లోకసభ ఎన్నికలతో పాటు రాష్ట్ర శానససభకు ముందుగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని, శానససభ ఎన్నికలను మాత్రం గడువు ప్రకారమే జరిగేలా చూడాలని కాంగ్రెసు నాయకత్వం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే లోకసభ ఎన్నికలపై దృష్టి పెట్టడం కష్టమవుతుందనే భావనతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో సాధించే సీట్లే కీలకమవుతాయని కాంగ్రెసు అధిష్టానం భావిస్తుంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఒకేసారి శానససభకు, పార్లమెంటుకు ఎన్నికలు జరిగినప్పుడు శాసనసభకు ఓట్లు వేసిన రీతిలోనే పార్లమెంటుకు ఓట్లేశారు. అత్యధిక శాసనసభ స్థానాలు గెలుచుకున్న పార్టీయే ఎక్కువ పార్లమెంటు సీట్లు గెలుచుకుంది.

రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తమకు ప్రజలు పట్టం కడుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నమ్ముతోంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే తమకు ఎక్కువ లోకసభ స్థానాలు వస్తాయని అనుకుంటోంది. అయితే, శాసనసభ, లోకసభ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరిగేలా కాంగ్రెసు అధిష్టానం చూసుకుంటున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+