చెప్పను: కావూరి, భద్రాచలం వదులుకోం: ఓయు జెఏసి

అధిష్టానానికి తమ అభిప్రాయం చెప్పామన్నారు. త్వరలోనే నిర్ణయం వస్తుందన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలకు ఏది అవసరమో అధిష్టానం అదే చేస్తుందన్నారు. విభజన పైన శాస్త్రీయ పద్ధతిలోనే నిర్ణయం ఉంటుందని చెప్పారు. చేనేత కార్మికులకు త్వరలోనే ఆరోగ్య భీమా పథకం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
నిష్పక్షపాతంగా ఇవ్వాలి: రాజయ్య
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు నిష్పక్షపాతంగా తమ రోడ్ మ్యాప్ అధిష్టానం పెద్దలకు ఇవ్వాలని వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. రాయల తెలంగాణ అధిష్టానం దృష్టిలో లేదన్నారు. విడిపోయి కలిసుందామన్నారు.
ఇచ్చినా, ఇవ్వకున్నా కాంగ్రెసులోనే: మల్లు రవి
రెండు వారాల్లో తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తే ఆ క్రెడిట్ ప్రజలకే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని విభజించినా, సమైక్యంగా ఉన్న తాను కాంగ్రెసులోనే కొనసాగుతానని చెప్పారు. యూపిఏ 3 అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.త
భద్రాచలం వదులుకోం: ఓయు జెఏసి
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో ఆదివారం భేటీ అయింది. తమకు ఈ నెల 12న సోనియా గాంధీ అపాయింటుమెంట్ ఇప్పించాలని కోరారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కోసం రోడ్ మ్యాప్ తయారు చేయాలని దామోదరకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
సోనియా అపాయింటుమెంట్ ఇచ్చారు: గజ్జెల
తనకు ఈ నెల 12వ తేదిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంట్ ఇచ్చారని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ గజ్జెల కాంతం చెప్పారు. కాగా పిసిసి చీఫ్ బొత్స ఈ రోజు ఢిల్లీలోనే మకాం వేశారు.












Click it and Unblock the Notifications