వంశీప్రియ కేసు: శంకరన్న, కూతురు సుస్మిత అరెస్టు

కాగా, తాను శంకర రావు కోడలుగా చెబుతున్న వంశీప్రియ అనే యువతి గత నెల 19వ తేదిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన భర్త శశాంక్, మామ శంకర రావు, అత్త విశ్వశాంతి, ఆడపడుచు సుష్మితను అరెస్టు చేయాలని ఆమె అందులో కోరారు. వారు తమను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులచే విచారణ జరిపించాలని కోరారు.
తనను వరకట్నం కోసం వేధిస్తున్నారన్నారు. అంతకుముందు క్రిమినల్ కోర్టు వారిని కోర్టు ఎదుట లొంగిపోవాలని, పాస్‌పోర్టులు పోలీసులకు ఇవ్వాలని ఆదేశించిందని కానీ, వారు సరెండర్ కాలేదని, వారిపై పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
వంశీప్రియ చేసిన ఫిర్యాదు మేరకు... శంకర రావు కూతురు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతనే తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె పేర్కొన్నారు. తనను వేధిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే వంశీప్రియ ఆరోపణలను శంకర రావు ఆ తర్వాత కొట్టిపారేశారు. మూడేళ్ల క్రితమే వెళ్లిపోయిన ఆమె తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
శంకరరావును పోలీసులు ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు. తమ నాన్న శంకరరావును ఆస్పత్రికి తీసుకుని వెళ్తారంటే తాను నమ్మబోనని సుస్మిత అన్నారు. తమ నాన్నను చంపేందుకే పోలీసులు తీసుకుని వెళ్లారని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications