చీటింగ్: దక్కన్ క్రానికల్ చైర్మన్, ఎండిలపై సిబిఐ కేసు

దక్కన్ క్రానికల్ చైర్మన్ నకిలీ పత్రాలను చూపించి కెనరా బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న ఆరోపణలు ఉన్నాయి. తీసుకున్న రూ.1230 కోట్లలో కొంతమొత్తం చెల్లించినట్లుగా తెలుస్తోంది. వీరిపై 120 బి రెడ్ విత్, 420, 468, 471 కింద అభియోగాలు నమోదు చేశారు.
కాగా, బ్యాంకులు ఆర్థిక సంస్థలకు రుణాల ఎగవేతతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కార్యాలయాలపై సోమవారం నాడు సిబిఐ అధికారులు మెరుపు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. బెంగళూరు నుంచి వచ్చిన సిబిఐ బృందం స్థానిక అధికారులతో కలిసి ఈ సోదాలు నిర్వహించినట్లుగా వార్తలు వచ్చాయి.
సంస్థ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు కీలక పత్రాలను పరిశీలించడంతో పాటు కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంకు దాఖలు చేసిన ఫిర్యాదుపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా సిబిఐ ఈ దాడులు నిర్వహించినట్లుగా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications