సమైక్యాంధ్ర: ఎమ్మెల్సీ రాజీనామా, సీమను విభజిస్తే....

MLC resign for Samaikyandhra
హైదరాబాద్/కడప: సమైక్యాంధ్ర కోసం శాసన మండలి సభ్యుడు హుస్సేన్ రాజీనామా బాట పట్టారు. రాయలసీమను విడగొట్టవద్దంటూ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ రాజీనామా చేశారు. మంగళవారం సమైక్యాంధ్ర కార్యాచరణ కమిటీ నేతలు షేక్ హుస్సేన్ ఇంటిని ముట్టడించి రాజీనామాకు డిమాండ్ చేశారు. వెంటనే ఆయన రాజీనామా పత్రాన్ని వారికి అందజేశారు.

విభజిస్తే ఉరేసుకుంటా

రాయలసీమను విడగొడితే శాసన సభ ఎదుట ఉరి వేసుకుంటానని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సిబిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లులో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణను కోరితే ఇచ్చేయడం తప్పేమీ కాదన్నారు. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని రాయలసీమను అస్థిరపరిస్తే సహించేదిలేదని హెచ్చరించారు.

సమైక్యంగానే ఉంటుంది: శైలజానాథ్

రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన జరగదని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటన సమైక్యాంధ్రకు సానుకూలంగా వస్తుందని, మనమే గెలుపుసాధిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రంపై ఒత్తిడి పెరగడానికి తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేసిన ప్రకటనలే కారణమన్నారు.

మూడు నెలల క్రితం ఈ రెండు పార్టీలు చేసిన ప్రకటనల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో దొరల పాలన ఎలా ఉంటుందో పెద్దలకు తెలుసన్నారు. ప్రస్తుతం వీరు చెబుతున్నట్లుగా రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే ప్రసక్తిలేదన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత సీమ వాసులపైనే అధికంగా ఉందన్నారు. తాను సమైక్యాంధ్ర ఉద్యమానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నానని, ఎలాంటి బెదిరింపులకు లొంగేది లేదని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+