దోషులుగా తేలితే పోటీకి నో, జైలు నుండి కూడా: సుప్రీం
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో రాజకీయ నాయకులు దోషులుగా తేలితే వారు ఎన్నికలలో పోటీకి అర్హులు కాదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రజాప్రతినిథ్యం చట్టంలోని 8(4) నిబంధన న్యాయసమ్మతం కాదని కోర్టు తేల్చి చెప్పింది.

క్రిమినల్ కేసుల్లో చిక్కుకొని దోషులుగా తేలితే పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర రాజకీయ నాయకులు పోటీకి అనర్హులు అన్నారు. కేసులలో ఎవరైనా దోషులుగా తేలిన వెంటనే వారు పదవులకు అనర్హులు అని తేల్చి చెప్పింది. దోషులుగా తేలిన వారు జైలు నుండి పోటీ చేయడం కుదరదని, పదవులు కోల్పోతారని తెలిపింది.
ప్రజాప్రాతినిథ్య చట్టంలో అనర్హత నుంచి తప్పించుకునే నిబంధన సరికాదని పేర్కొంది. పాత కేసులకు ఈ తీర్పు వర్తించదని చెప్పింది. ఇక నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని పేర్కొంది. చట్టం లొసుగు నుంచి నేరస్థులు తప్పించుకుంటున్నారని కోర్టు అభిప్రాయపడింది. అప్పీలు పెండింగులో ఉన్నంత కాలం ప్రజాప్రతినిధులు అనర్హులు కాదన్న నిబంధనను కోర్టు తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications