భారత్: పొలంలో ఒకరు, బైక్‌పై ఇంకొకరు!(పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారత దేశం యొక్క సంస్కృతి భారత ప్రజల జీవన విధానాన్ని సూచిస్తుంది. భారత దేశంలోని భాషలు, మతాలు, ఆర్కిటెక్చర్, ఆహార పద్ధతులు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. అయినా భారత జాతి మాత్రం ఒక్కటే.
ప్రేమకు చిహ్నంగా కట్టిన తాజ్ మహల్‌ను అందరూ సందర్శిస్తారు. ఓ చోట వ్యవసాయం చేసే రైతులు కనిపిస్తే, మరోచోట ద్విచక్రవాహనం, కార్లు, విమాలాల్లో దూసుకు వెళ్లే వారు కనిపిస్తారు. ఆధ్యాత్మికత పాళ్లు కూడా ఎక్కువే.
క్రికెట్, సినిమా రంగాలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. మన దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. దీంతో క్రికెట్‌ను ఓ మతంగా అభివర్ణిస్తారు. ఇక్కడ కొన్ని అద్భుతమైన చిత్రాలు...

తాజ్ మహల్ అందాన్ని వీక్షిస్తున్న సందర్శకులు. మబ్బులు కమ్ముకోవడంతో మరింత అందగా కనిపిస్తున్న తాజ్

వరి పంట వేసేందుకు పొలంలో నాగలి దున్నతున్న ఓ రైతు. ఈ దృశ్యం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని హోరోబంగా గ్రామంలోనిది.

పొలంలో వరి పంట వేసేందుకు ఫీల్డ్‌ను సిద్ధం చేస్తున్న రైతులు. పెద్దలకు సహకరిస్తున్న చిన్నారులు

ముంబైలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. నీరు నిలిచిపోయిన ఓ రోడ్డు పైనుండి ద్విచక్ర వాహనంపై దూసుకెళ్తున్న దృశ్యం

నాగోన్ ప్రాంతంలో పశువులు కాసే పిల్లలు. భారీ వర్షం కారణంగా చెరువు పొంగడంతో నీరు రోడ్డు పైకి వచ్చింది.

పుణేలోని జేజూరి గుడి వద్ద పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు పసుపును గాల్లోకి జల్లుతున్న దృశ్యం. సోమవతి అమావాస్య సందర్భంగా ఇలా చేస్తారు.

పార్టీ కార్యకర్తలకు డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అభివాదం.

రెండు రోజుల క్రితం భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ధోనీ మొహానికి వెస్టిండీస్ ప్లేయర్లు కేకు పూసి వేడుకలు జరుపుకున్నారు.

నాగోన్‌లోని జకలబంద వద్ద ఎలక్ట్రిక్ షాక్‌కు గురై భారీ ఏనుగు మృతి చెందింది. దాని చుట్టు మూగి చూస్తున్న జనం

సోమవతి అమావాస్య పండుగ సందర్భంగా జేజూరు గిడికి వెళ్లేందుకు ఓ రైలులో కాలుమోపలేని స్థితిలో ఎక్కిన భక్తులు.

కోల్‌కతాలోని అలిపోర్ జంతు ప్రదర్శన శాలలో విశ్రాంతి తీసుకుంటున్న రాయల్ బెంగాల్ టైగర్.












Click it and Unblock the Notifications