కెసిఆర్‌ను చూపించి రెచ్చగొడ్తున్నారు: ఉండవల్లిపై హరీష్

పోలవరం కోసం గతంలో గిరిజనులను కాల్చి చంపమన్న ఉండవల్లి ఓ డయ్యర్ అన్నారు. ఆయన వ్యాఖ్యల్లో వెటకారం తప్ప ఎక్కడా హేతుబద్దత కనిపించడం లేదన్నారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది ఉండవల్లే అన్నారు. తెలంగాణ వస్తుందంటే సీమాంధ్ర నేతలు ఏదో ఒక కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణను మరోసారి అడ్డుకునే కుట్రకు సీమాంధ్ర నేతలు తెరలేపారన్నారు.
కెసిఆర్ చెప్పేవన్నీ అబద్దాలే అయితే పన్నెండేళ్లుగా ఉద్యమం ఎలా నడుస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ అనుభవాలు చెప్పారన్నారు. ప్రజలు తమకు ఎందుకు మద్దతు తెలుపుతున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెసు పార్టీ కూడా 2004లో ఎందుకు పొత్తు పెట్టుకుందన్నారు. కెసిఆర్‌ను చూపించి సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. అబద్దాలతో ఎక్కడా ఉద్యమాలు కొనసాగవన్నారు. మిగిలిన ప్రత్యేక ఉద్యమాలకు తెలంగాణతో సంబంధం లేదన్నారు.
తెలంగాణకు ఏకాభిప్రాయం కావాలంటున్న వారు.. పోలవరం ప్రాజెక్టును గిరిజనుల ఏకాభిప్రాయంతోనే కడుతున్నారా అని ప్రశ్నించారు. కరీంనగర్‌లో ఉండవల్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రసంగాన్ని తర్జూమా చేశారన్నారు. మైనర్ ఇరిగేషన్‌కు ఉండవల్లి చెప్పినట్లుగా తమకు ఎక్కడా నీరు రాలేదన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రైతులు ఎప్పుడూ రోడ్డెక్కుతున్నారన్నారు. తెలంగాణలో ఆదాయం ఎక్కువని కెసిఆర్ చెప్పిన విషయానికి కట్టుబడి ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications